ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో వృద్ధ దంపతులు మంటల్లో చిక్కుకుని మరణించటం విషాదం నింపింది. అమర్తలూరు మండలం పాంచాలపురం గ్రామంలో గున్న లక్ష్మయ్య, భాగ్యమ్మ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో వారి ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గుడిసె కావటంతో కాసేపట్లోనే మంటలు వ్యాపించాయి. దంపతులిద్దరూ మంటల్లో చిక్కుకుపోయారు.
గుడిసెకు నిప్పంటుకుని వృద్ధ దంపతులు సజీవ దహనం - గుడిసెకు నిప్పంటుకుని గుంటూరులో దంపతులు మృతి న్యూస్
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం పాంచాలవరంలో విషాదం చోటు చేసుకుంది. గుడిసెకు నిప్పంటుకుని వృద్ధ దంపతులు సజీవ దహనమయ్యారు.
గుడిసెకు నిప్పంటుకుని వృద్ధ దంపతులు సజీవ దహనం
భాగ్యమ్మ అనారోగ్యంతో ఉండటంతో కొద్దికాలంగా మంచానికే పరిమితమైనట్లు స్థానికులు తెలిపారు. మంటలు చెలరేగిన సమయంలో లక్ష్మయ్య కూడా పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఇద్దరూ సజీవ దహనమయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:వీధి కుక్కలు దాడి.. 25 మూగ జీవాలు మృతి