DOG CARRY BORNBABY HEAD: బుజ్జి పాదాలు.. చిన్ని చేతులు.. పాలుగారే పసిబుగ్గలు.. లేలేత పెదాలపై విరబూసే బోసి నవ్వులు.. కేరింతలు.. ఇవన్నీ చూస్తూ ఏ తల్లి అయినా మురిసిపోతుంది. ఆ క్షణాల కోసం ప్రతీ అమ్మా ఆరాటపడుతుంది. కానీ.. ఈ తల్లి మాత్రం తన బిడ్డ పట్ల కర్కషంగా వ్యవహరించింది. అమ్మతనాన్ని పక్కనబెట్టి.. పేగుతెంచుకు పుట్టిన శిశువును.. గాలికొదిలేసి పొట్టనబెట్టుకుంది. రక్తపుమరకలు కూడా ఆరని ఆ పసిగుడ్డును కుక్కలకు ఆహారమయ్యేలా చేసింది. ఆ పసిగుడ్డు తలను ఓ వీధి కుక్క నోటకరుచుకుని జనావాసాల్లోకి రావటం వల్ల.. ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే.. ఈ సన్నివేశం హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా గేట్ వద్ద దర్శనమిచ్చింది.
DOG CARRY BORNBABY HEAD: కుక్క నోట్లో నవజాత శిశువు తల.. ఎక్కడంటే?
DOG CARRY BORNBABY HEAD: పాలుగారే పసిపాపలు ఎంతో సుకుమారంగా ఉంటారు. చిన్న గీతపడితేనే గుక్కపట్టి ఏడుస్తారు. అది చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటిది.. కొందరు తల్లిదండ్రులు మాత్రం కర్కషంగా.. అప్పుడే పుట్టిన పసిగుడ్డులను చెత్తకుప్పల్లో.. ముళ్లపొదల్లో వదిలేస్తున్నారు. రక్తపు మరకలు కూడా ఆరని ఆ మాంసపు ముద్దలను.. చీమలు, పక్షులు, కుక్కలకు వదిలేసి.. అమానుషంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ కర్కష తల్లి చేసిన ఘనకార్యానికి.. ఏపాపమెరుగని ఓ నవజాత శిశువు శునకానికి ఆహారంగా మారిపోయింది.
సహార గేట్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో అప్పుడే పుట్టిన ఓ శిశువు తలను ఓ శునకం నోటకరచుకొని వీధుల్లో తిరుగుతోంది. దాన్ని చూసిన స్థానికులు.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పక్కనే ఉన్న పాల బూత్ యజమాని కుక్కని తరిమేసి.. వెంటనే వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. శిశువు తల వీధి శునకం ఎక్కడ నుంచి తెచ్చిందనే విషయంపై సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ శిశువును ఎవరు వదిలేసివెళ్లారు. చనిపోయాక వదిలేసి వెళ్లారా..? లేక.. ప్రాణంతోనే వదిలేసి వెళ్లారా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి.. తాత, తండ్రి, మనుమడు మృతి..