తెలంగాణ

telangana

ETV Bharat / crime

NIA Raids in Kurnool : కర్నూలులో విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

NIA Raids in Kurnool : కర్నూలులో విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేసింది. కేరళకు సంబంధించిన కేసులో పినాకపాణికి ఎన్‌ఐఏ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ నోటీసులు ఇచ్చారు.

NIA Raids in Kurnool
NIA Raids in Kurnool

By

Published : Mar 5, 2022, 12:44 PM IST

NIA Raids in Kurnool: కర్నూలు నగరంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. విరసం కార్యవర్గసభ్యుడు పినాకపాణి ఇంట్లో సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు ఆయనకు కేరళకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ ఇన్​స్పెక్టర్​ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణ నిమిత్తం 3వ పట్టణ పోలీసు స్టేషన్​కు రావాలని ఎన్ఐఏ అధికారులు పినాకపాణిని ఆదేశించారు.

NIA Search in Kurnool: కేరళకు తానెప్పుడూ వెళ్లలేదని.. అక్కడ తనకు పరిచయస్థులు ఎవ్వరూ లేరన్నారు పినాకపాణి. అలాంటిది తనపై కేరళలో రాజద్రోహం కేసు నమోదు చేయడం.. ఆ కేసులో ఏ2 తన పేరు నమోదు చేయడం దారుణమని పినాకపాణి తెలిపారు. గతంలో కుడా ఎన్ఐఏ అధికారులు పినాకపాణి ఇంట్లో సోదాలు చేశారు.

కర్నూలులో విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

ABOUT THE AUTHOR

...view details