తెలంగాణ

telangana

ETV Bharat / crime

కుమార్తె మాట వినడం లేదని తల్లి ఆత్మహత్య - నారాయణగూడలో తల్లి ఆత్మహత్య

Mother Suicide at Narayanaguda : కుమార్తె చెప్పిన మాట వినడం లేదని.. చదువు పక్కనపెట్టి స్నేహితులతో కాలక్షేపం చేస్తోందని ఓ తల్లి తన కూతురికి నచ్చజెప్పింది. ఎంత చెప్పినా తన కుమార్తె వినడం లేదని.. ఎక్కడ ఆమె భవిష్యత్ పాడవుతుందోనని మనస్తాపం చెందిన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నారాయణగూడలో చోటుచేసుకుంది.

Mother Suicide at Narayanaguda
Mother Suicide at Narayanaguda

By

Published : Apr 22, 2022, 9:03 AM IST

Mother Suicide at Narayanaguda : కుమార్తె.. చెప్పిన మాట వినడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నారాయణగూడ సీఐ భూపతి గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌గూడ ముత్యాలబాగ్‌, ఆర్టీసీ గెస్ట్‌ హౌస్‌ సమీపంలో నివసిస్తున్న దంపతుల కుమార్తె డిగ్రీ చదువుతోంది. కొన్నాళ్లుగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదు. చదువు పక్కనపెట్టి స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తోందని తెలిసి తల్లి(38) చాలా సార్లు మందలించింది. అయినా వినిపించుకోవడం లేదని మనస్తాపం చెందిన ఆమె ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details