Girl gang rape in Hyderabad : బాలికలపై లైంగిక దాడులను అరికట్టడానికి ప్రభుత్వం పోక్సో చట్టం తీసుకొచ్చినా.. రాష్ట్రంలో రోజుకో చోట వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంధులు వారి పశువాంఛను తీర్చుకోవడానికి చిన్నపిల్లలను, అమాయకపు బాలికలను వాడుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లోని పాతబస్తీ ఏరియాలో కొందరు యువకులు బాలికకు మద్యం తాగించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
minor Girl gang rape in Hyderabad : ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన ఓ బాలిక ఈనెల 4వ తేదీన మందులు కొనుగోలు చేసేందుకు తనకు తెలిసిన హోల్‌సేల్ ఔషధాలు విక్రయించే దుకాణం వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న ముగ్గురు యువకులు తక్కువ ధరకు మందులు ఇప్పిస్తామని నమ్మించి.. బాలికను కందికల్లోని బోయిగూడలో ఓ ఇంటికి తీసుకువెళ్లారు.
ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆ బాలికతో బలవంతంగా హుక్కా తాగించారు. ఆ తర్వాత కాసేపటికి శీతల పానీయంలో మద్యం కలిపి బాలిక చేత తాగించారు. అనంతరం ఆమెతో వారు అసభ్యంగా ప్రవర్తించడంతో కేకలు వేసింది. గమనించిన నిందితులు బాధితురాలి అరుపులు బయటకు వినపడకుండా మ్యూజిక్ సిస్టంలో సౌండ్ పెంచారు. దీంతో ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. బాలికపై దాడికి పాల్పడ్డారు. కొద్దిసేపటి తర్వాత మత్తులోకి జారుకోగానే ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.