తెలంగాణ

telangana

ETV Bharat / crime

Lovers Suicide in Kalwakurthy : కల్వకుర్తి కెనాల్​లో దూకిన ప్రేమజంట.. గుడిపల్లి జలాశయంలో మృతదేహాలు - Lovers Dead bodies in Gudipalli Reservoir

పెళ్లైన వ్యక్తితో బాలిక ప్రేమ
పెళ్లైన వ్యక్తితో బాలిక ప్రేమ

By

Published : Jan 22, 2022, 8:35 AM IST

Updated : Jan 22, 2022, 9:55 AM IST

08:31 January 22

గుడిపల్లి జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యం

Lovers Suicide in Kalwakurthy : తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఓ వివాహితుడు తను ప్రేమించిన బాలికతో కలిసి ఈనెల 20న నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల దూకాడు. వారి మృతదేహాలను పోలీసులు ఇవాళ.. వనపర్తి జిల్లా గుడిపల్లి జలాశయంలో గుర్తించి వెలికితీశారు.

అసలేం జరిగిందంటే..

Lovers Suicide in Nagarkurnool : నాగర్​కర్నూల్​ పట్టణం సంజయ్​నగర్ కాలనీకి చెందిన నరేశ్​​కు, అచ్చంపేటకు చెందిన మౌనిక అనే అమ్మాయితో ఆరేళ్ల కిందటే వివాహం జరిగింది. వారికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. మరోవైపు నరేశ్(25)​ కల్వకుర్తి పట్టణానికి చెందిన కల్యాణి(17)తో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ విషయం ఇరు ఇళ్లలో తెలిసి గొడవలయ్యాయి. ఇరువైపుల పెద్దలు ఇద్దరికి సర్దిజెప్పారు.

కానీ తమ ప్రేమను పెద్దలు అర్థం చేసుకోవడం లేదని భావించిన కల్యాణి ఈనెల 17న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మరోవైపు నరేశ్​కూడా అదృశ్యం కావడంతో ఇరు కుటుంబాలు స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కంప్లెయింట్ నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురి కోసం గాలింపు మొదలుపెట్టారు.

కెనాల్ వద్ద చెప్పులు, చేతివాచీలు

Lovers Jumped into Kalwakurthy Canal : ఈ క్రమంలో గౌరీదేవిపల్లి గ్రామ సమీపంలోని కల్వకుర్తి ఎత్తిపోతల కెనాల్ గట్టున యువతీ యువకుల చెప్పులు, చేతివాచీలు గుర్తించారు పోలీసులు. అక్కడే ఓ సూసైడ్ లెటర్​ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ వస్తువులు అదృశ్యమైన నరేశ్, కల్యాణిలవేనని గుర్తించారు. వాళ్లిద్దరు కెనాల్​లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రహించారు. వారి కోసం కెనాల్​లో గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. రెండ్రోజుల నుంచి గజఈతగాళ్లు, పోలీసులు వారి కోసం గాలిస్తూనే ఉన్నారు. అయినా వారి ఆచూకీ కానరాలేదు.

గుడిపల్లి జలాశయంలో మృతదేహాలు

Lovers Dead bodies in Gudipalli Reservoir : ఇవాళ ఉదయం వనపర్తి జిల్లాలోని గుడిపల్లి జలాశయంలో రెండు మృతదేహాలు తేలడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాలు.. అదృశ్యమైన నరేశ్, కల్యాణివిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కలిసి బతలేక.. విడిచి ఉండలేక..

'గత నాలుగేళ్లుగా మేము(నరేశ్​, కళ్యాణి) ప్రేమించుకుంటున్నాం. మా ప్రేమ మా ఇళ్లలో తెలిసి తిట్టడమే కాకుండా కొట్టారు. మమ్మల్ని విడిపోవాలని ఇబ్బంది పెట్టారు. మేమిద్దరం విడిపోవడం ఇష్టం లేక మూణ్నాలుగు రోజులు బయట కలిశాం. ఈ విషయం ఇంట్లో తెలిసి ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరించారు. కలవకూడదంటూ టార్చర్​ పెట్టారు. వాళ్ల వేధింపులు భరించలేక​ సూసైడ్​​ చేసుకుంటున్నాం.'

- నరేశ్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 22, 2022, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details