Selfie Suicide: సజావుగా సాగుతున్న ఆ దంపతుల కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. తన భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని మనోవేదనకు గురైన భర్త.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్ నివాసి అయిన గూడూరు శేఖర్.. నాగాంజలి అనే మహిళను 2014లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూమార్తె, కుమారుడు ఉన్నారు.
నాగాంజలి హైదరాబాద్‌లోని కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పని చేస్తూ.. ఈ ఏడాది జనవరిలో ఆదిలాబాద్‌కు బదిలీ అయింది. అయితే నాగాంజలి హైదరాబాద్‌లో పనిచేస్తున్న సమయంలో నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న స్వరూప్రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారు చనువుగా ఉండటం భర్త శేఖర్ గమనించాడు. అది తప్పు అని శేఖర్ ఆమెను మందలించాడు. నాగాంజలి తన తప్పు ఒప్పుకుని.. పెద్దల సమక్షంలో భవిష్యత్తులో అలాంటి తప్పులు పునరావృతం కావని క్షమాపణ కోరింది. ఆ తర్వాత కొంతకాలం వారి కాపురం సజావుగా సాగింది.