తల్లిని చంపిన కుమారుడు.. అడ్డువచ్చిన చెల్లిపై.. - telangana news
11:04 January 24
Man Killed his Mother: తల్లి మందలించడంతో కోపంతో రాడ్డుతో కొట్టిన సుధీర్
Man Killed his Mother: హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ కుమారుడు తల్లిని రాడ్డుతో తలపై కొట్టి చంపాడు. సుల్తాన్‌బజార్‌కు చెందిన సుధీర్‌కు కొంత కాలంగా మానసిక స్థితి సరిగా ఉండటం లేదు. ఈ క్రమంలోనే అతను అర్ధరాత్రి లేచి వ్యాయామం చేయడం ప్రారంభించాడు.
కుమారుడు ఆ సమయంలో వ్యాయామం చేయడం చూసిన తల్లి.. అతనిని మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన సుధీర్.. చేతిలో రాడ్డుతో తల్లి తలపై బలంగా కొట్టాడు. అడ్డు వచ్చిన చెల్లిపై కూడా రాడ్‌తో దాడి చేశాడు. తల్లి చనిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చెల్లిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:Social Media Posts: సామాజిక మాధ్యమాలపై పోలీసు కన్ను.. విద్వేషాలు రెచ్చగొడితే ఇక అంతే!