హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ నుంచి దూకిన వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి(Suicide at Metro station) చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఛత్తీస్గఢ్ పుల్పహాడ్ ప్రాంతంలోని కువకొండ వాసి భీమా(45)గా గుర్తించారు. జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన భీమా ఏ కారణాలతో బలవన్మరణాని(Suicide at Metro station)కి పాల్పడ్డాడో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Suicide at Metro station : దిల్‌సుఖ్‌నగర్ మెట్రో పైనుంచి దూకిన వ్యక్తి మృతి
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ మొదటి అంతస్తుపై నుంచి దూకిన వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి బలవన్మరణాని(Suicide at Metro station)కి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
దిల్‌సుఖ్‌నగర్ మెట్రో పై నుంచి దూకిన వ్యక్తి మృతి
ఛత్తీస్గఢ్ వాసి భీమా గురువారం ఉదయం దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్కు వెళ్లాడు. అక్కడే కాసేపు అటూ ఇటూ తిరిగాడు. ఎవరూ చూడని సమయంలో ఒక్కసారిగా మొదటి అంతస్తు నుంచి కిందకు దూకాడు(Suicide at Metro station). మెట్రో కింద ఉన్న చిరువ్యాపారులు, ప్రయాణికులు, ఇతరులు ఇది గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు భీమాను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు శుక్రవారం ఉదయం మరణించాడు.