Sexual harassments on Minor : అధికారంలో ఉన్నా లేకపోయినా మన సమస్యలు తీర్చేవారే నిజమైన నాయకుడు అని భావిస్తాం. ప్రజల పక్షాన నిలబడేవారికే మన మద్దతు తెలుపుతాం. కానీ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన నాయకుడే.. సమస్యగా మారితే ఇక ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి సందర్భాలకు దృష్టాంతమే.. నిర్మల్లో బాలికపై ఓ ప్రజాప్రతినిధి అత్యాచార ఘటన. అది మరువకముందే ఓ బాలికపై ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు అత్యాచారానికి యత్నించాడు. హైదరాబాద్లో జాంబాగ్కు చెందిన మజ్లిస్ నాయకుడు రఫిక్.. 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఇంట్లోనే లైంగిక దాడికి యత్నం
ఓ అపార్ట్మెంట్లో నివసించే రఫిక్... అదే భవనంలో ఉండే బాలికను భయపెట్టి తన ఇంట్లోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన బాలిక గట్టిగా కేకలు వేయడంతో చిన్నారిని వదిలేశాడు. తప్పించుకున్న బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. విషయం విని ఆగ్రహానికి లోనైన తల్లిదండ్రులు రఫిక్కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రఫిక్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఆ ఖైదీకి జైలు గోడలు... పిట్టగోడలతో సమానం.. ఇప్పటికే రెండు సార్లు ఎస్కేప్..