ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు(Lovers suicide). కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నారు. కలిసి ఉంటే ఎంత సంతోషంగా గడుపుతామో అంటూ ఊసులు చెప్పుకున్నారు. కానీ చివరికి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఏపీలోని కృష్ణా జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
కంచికర్ల మండలం మొగులూరుకు చెందిన యువతి, యువకుడు(Lovers suicide) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తమ ప్రేమను పెద్దల(Lovers suicide)కు తెలియజేశారు. వారు ఒప్పుకోలేదు. వారిని ఒప్పించటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఒకరిపై ఒకరికి ఎంత ఇష్టముందో తెలియజేశారు. ఒకరికి ఒకరు లేకుండా బతకలేమన్నారు. తాము కలిసి బతికితేనే తమ భవిష్యత్తు బాగుంటుందని నచ్చజెప్పాలని చూశారు.