Local Leaders are Occupying Empty Spaces: వరంగల్ నగరంలో అధికార పార్టీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి. నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. కబ్జాలకు కాలు దువ్వుతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఓ కాలనీలో కార్పొరేటర్ విశ్వనాధ్ 50 అడుగుల రహదారికి అడ్డంగా భవనం నిర్మించాడు. కాలనీవాసులు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు.
స్పందించిన కేటీఆర్ ఆ భవనం కూల్చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో చేసేదిలేక కార్పొరేషన్ అధికారులు హుటాహుటిన దాన్ని కూల్చేశారు. అయినా తీరు మార్చుకోని ఆ కార్పొరేటర్ మరోసారి రహదారికి అడ్డంగా నిర్మాణం చేపట్టాడు. అంతటితో ఆగకుండా పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న మట్టికోటకు సమీపంలోని కుంటను చదును చేసి ప్లాట్లుగా మార్చాడు.
Land Grabs With Support of Ruling Party Leaders: ఇక మరో కార్పొరేటర్ భర్త ఏకంగా చెరువును కబ్జా చేసేందుకు యత్నించగా.. చెరువులు, కుంటల పరిరక్షణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆ వార్త వైరల్ కావడంతో వెనక్కి తగ్గాడు. ఇంకో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ఏకంగా రిజిస్ట్రార్ సంతకం ఫోర్జరీ చేశాడన్న ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. ఇతనికి హనుమకొండకు చెందిన ఓ సీనియర్ రాజకీయ నాయకుని అండదండలున్నాయని ప్రచారం జరుగుతోంది.