మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరులో అలివేలమ్మ అనే మహిళను హత్యచేసిన కేసులో బాలనగర్ మండలం గండీడ్ గ్రామానికి చెందిన ఎరుకలి శ్రీనివాసులుకి గద్వాల మూడో న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2019 డిసెంబర్ 17న డోకూరు శివారులో అలివేలమ్మ మృతదేహం లభ్యమైంది. క్లూస్ టీం ఇచ్చిన సమాచారంతో ఆమె హత్యలో పాతనేరస్తుల పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఎరుకలి శ్రీనివాసులును విచారించారు. అతని బండారం బైటపడింది. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం కోర్టులో జరిగిన విచారణలో నేరం రుజువైంది. న్యాయమూర్తి అతనికి జీవిత ఖైదుతో పాటు వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.
ఒకటి కాదు రెండు కాదు 17 మంది మహిళల్ని శ్రీనివాసులు హత్య చేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. కల్లు, మద్య తాగే ఒంటరి మహిళల్నే శ్రీనివాసులు లక్ష్యంగా ఎంచుకుంటాడు. ఆభరణాలు ధరించి ఉండే చాలు వారికి మాయమాటలు నిర్మాణుష్య ప్రదేశాలకు తీసుకువెళ్తాడు. హత్యచేసి ఆభరణాల్నిదోచుకుని వెళ్లిపోతాడు. అలివేలమ్మ హత్య కూడా అలాగే చేశాడు. అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లా శివశక్తినగర్ లో నివాసముండే శ్రీనివాసులు నవాబు పేట మండలం కూచుర్ గ్రామానికి చెందిన చిట్టి అలివేలమ్మ ను మహబూబ్ నగర్ లోని టీ.డీ గుట్ట ప్రాంతంలోని కల్లు దుకాణంలో చూశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి దేవరకద్ర మండలం, డోకూర్ గ్రామశివారులోకి తీసుకెళ్లాడు. కళ్ళు తాగించి, మత్తులోకి వెళ్లిన తర్వాత హతమార్చాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లాడు.