మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఎల్బీనగర్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. బోయిన్‌పల్లిలో లిఫ్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుపతి అనే వ్యక్తి మైనర్ బాలికను కిడ్నాప్ చేసినట్లు ఆమె తండ్రి సికింద్రాబాద్ జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాలికను బలవంతంగా వివాహం చేసుకుని తమ బంధువుల ఇంట్లో ఉంచాడని.. అనంతరం ఆరు నెలల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు - హైదరాబాద్ తాజా వార్తలు
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఎల్బీనగర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. బోయిన్ పల్లిలో లిఫ్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుపతి అనే వ్యక్తి తమ కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్లు... బాలిక తండ్రి 2016లో జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు తాజాగా నిందితుడికి శిక్షను ఖరారు చేసింది.
అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన వ్యక్తి
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు... అతనిపై అపహరణ, అత్యాచారం కింద కేసు నమోదు చేసి జవహర్ నగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ చేపట్టిన ఎల్బీనగర్ కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.