తెలంగాణ

telangana

ETV Bharat / crime

అంతరాష్ట్ర దొంగ అరెస్టు.. రూ. 32 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం

పలు చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అంతరాష్ట్ర దొంగ జగన్నాధ్​ను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ. 32 లక్షలు విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బీనగర్ జోన్ డీసీపీ సంప్రీత్ సింగ్ వెల్లడించారు.

By

Published : Apr 11, 2022, 9:09 PM IST

thief arrest
thief arrest

రాత్రి సమయంలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ జగన్నాధ్​ను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్బీనగర్​ జోన్ డీసీపీ సంప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. నిందితుని వద్ద నుంచి రూ. 32 విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలోనే పట్టుకుని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.

'ఏ1 నిందితుడు జగన్నాధ్​పై కర్ణాటకలోనూ పలు దొంగతనాల కేసులు ఉన్నాయి. నిందితుడి నుంచి 44 తులాల బంగారు ఆభరణాలు, 56 తులాల వెండి నగలు, 25 వేల రూపాయల నగదు, కారు, 21 యూఎస్ డాలర్లు, 26 చేతి గడియారాలు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. నిందితుడిని రిమాండ్​కు తరలించాం. పరారీలో ఉన్న మరో దొంగను త్వరలోనే పట్టుకుంటాం.'

-సంప్రీత్ సింగ్, ఎల్బీనగర్​ జోన్ డీసీపీ

ఇదీ చదవండి:Cricket Betting: తెలుగునాట క్రికెట్‌ బెట్టింగ్‌ జోరు.. బుకీల చేతుల్లో చిక్కి యువత బలి

ABOUT THE AUTHOR

...view details