సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామ కమాన్ సమీపంలో బాహ్య వలయ రహదారిపై బియ్యం లోడు తీసుకెళ్తున్న లారీ రాత్రి బోల్తా కొట్టింది. దీనితో లారీ డ్రైవర్ నరసింహులు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. బానూరు పోలీసులు క్రేన్ సాయంతో చాలా సేపు శ్రమించి.. బయటకు తీసి.. పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.
Accident: లారీ బోల్తా.. క్యాబిన్ ఇరుక్కుపోయిన డ్రైవర్
బియ్యం లోడు తీసుకెళ్తున్న లారీ బాహ్య వలయ రహదారిపై నుంచి బోల్తా కొట్టింది. దీనితో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. క్రేన్ సాయంతో పోలీసులు.. డ్రైవర్ను బయటకు తీసి.. ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
lorry accident
ఈ లారీ బియ్యం లోడును ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు నుంచి కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ పరిస్థితి బాగానే ఉందని పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- ఇదీ చదవండి :Palamooru Mango: పాలమూరు మామిడికి మహర్దశ