ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఓ లారీ.. స్పెషల్ పోలీసు ఆఫీసర్ ప్రాణాలు తీసింది. లారీ చక్రం తలమీదకు ఎక్కడంతో షేక్ మహ్మద్ నాజర్ అక్కడికక్కడే చనిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి చెందిన నాజర్.. గుంటూరు రూరల్ వెంగలాయపాలెంలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.
విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే మృతి - గుంటూరు తాజా రోడ్డు ప్రమాదం
ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం చెక్‌పోస్టు వద్ద ఓ ట్రాక్టర్‌ను సోదా చేస్తున్న స్పెషల్ పోలీసు ఆఫీసర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీసు అధికారి అక్కడికక్కడే మృతిచెందారు.
గుంటూరులో కానిస్టేబుల్ మృతి
ఫిరంగిపురం చెక్ పోస్టు వద్ద గుంటూరు వెళ్తున్న ట్రాక్టర్‌ను సోదా చేస్తుండగా ట్రాక్టర్‌ను లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో మహ్మద్ నాజర్ కింద పడిపోయారు. మీదకు దూసుకొచ్చిన లారీ.. ఆయనపై నుంచి వెళ్లింది. ఈ దుర్ఘటనలో నాజర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్, క్లీనర్‌ను.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికిి తరలించారు.
ఇదీ చూడండి:WOMAN DIED: మిరపకాయలు పట్టించేందుకు వెళ్లి.. మృత్యుఒడికి చేరింది