Family suicide in Vijayawada case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విజయవాడలో తెలంగాణ వాసుల ఆత్మహత్య కేసులో కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. కుటుంబం ఆత్మహత్యకు ఫైనాన్స్ సంస్థల వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
Family suicide in Vijayawada case: ఏపీలో తెలంగాణ వాసుల ఆత్మహత్య కేసులో కీలక ఆధారాలు
12:00 January 09
విజయవాడ: నిజామాబాద్ వాసుల ఆత్మహత్య కేసులో కీలక విషయాలు
ఇబ్బందులు పెట్టిన వారి వివరాలను లేఖలో పేర్కొన్న కుటుంబం.. వేధించిన వారి వివరాలను సెల్ఫీ వీడియోలో రికార్డు చేసి వారి బంధువులకు పంపించినట్లు సమాచారం. ఫైనాన్స్ వారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో మృతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు వారి బంధువులు తెలిపారు. ఆ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలతో వేధింపులకు పాల్పడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
వడ్డీవ్యాపారుల వల్లే..
విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్ మృతుల బంధువులు విజయవాడకు చేరుకున్నారు. మృతుల బంధువుల సమక్షంలో.. మొత్తం నాలుగు మృతదేహాలకు వైద్యులు శవ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక నాలుగురు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. వేధింపులకు గురిచేసిన వారి వివరాలను పోలీసులు స్టేట్మెంట్లో రికార్డ్ చేశారు. శవపరీక్షలు పూర్తైన తర్వాత.. మృతదేహాలను పోలీసులు బంధువులకు అందజేయనున్నారు.
ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తెలంగాణకు చెందిన బలవన్మరణం చెందింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణానదిలో దూకారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ విధిలో శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రంలోని 3వ ఫ్లోర్‌లోఈనెల 6వ తేదీని.. పప్పుల అఖిల్ పేరిట తెలంగాణ నుంచి వచ్చిన ఒక కుటుంబం గది తీసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు నిజామాబాద్ నుంచి శ్రీ రామ ప్రసాద్ అనే వ్యక్తి సత్రానికి ఫోన్ చేసి తన తన బావ సురేశ్ అప్పుల బాధతో చనిపోతున్నట్లు సమాచారం అందించారు. రాత్రి రెండున్నర గంటలకు తన బావ వద్ద నుంచి ఈ మేరకు వాయిస్ మెసెజ్‌లు వచ్చాయని తెలిపాడు. దీంతో సత్రం సిబ్బంది సురేశ్ కుటుంబం ఉన్న గదికి వెళ్లి చూడగా... అప్పటికే ఇద్దరు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులు పప్పుల సురేష్(56), పప్పుల శ్రీలత కాగా...వారి కుమారులు 28 ఏళ్ల అఖిల్, 22 ఏళ్ల ఆశిష్‌గా గుర్తించారు.