కేరళకు చెందిన ల్యూకోజ్, గీతు అలియాస్ మేరీ దంపతులు ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ కుషాయిగూడలో నివాసం ఉంటున్నారు. మేరీ ముందుగా యువకులను పరిచయం చేసుకొని వలవేసుకుంటుంది. తన దారిలోకి తెచ్చుకొని తనదైన శైలిలో వారి వద్ద నుంచి తోచినంత డబ్బులు వసూలు చేస్తోంది. ఆమె దారికి అడ్డువస్తే తనపై అత్యాచారం చేసి చంపడానికి యత్నించారని వారిపై పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తుంది. ఇదే తరహాలో కుషాయిగూడకు చెందిన ఓ యువకుడు ఆమె ఉచ్చులో ఇరుక్కున్నాడు. విషయం తెలుసుకున్న యువకుడి తండ్రి బ్రహ్మచారి కుషాయిగూడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు పట్టించుకోకపోవడమే కాకుండా మోసం చేస్తున్న మేరీకి వత్తాసు పలకడంతో న్యాయం కోసం పెద్దకొడుకుతో కలిసి హెచ్చార్సీని ఆశ్రయించారు.
డబ్బు లేదంటే బ్లాక్ మెయిల్
తనకు ఒక కూతురు, ఇద్దరు కుమారులని బ్రహ్మచారి పేర్కొన్నారు. కుషాయిగూడలోని హోసింగ్ కాలనీకి మేరీ దంపతులు 2015లో వచ్చారని చెప్పారు. తన చిన్న కొడుకు పరమేశ్‌ను మేరీ తన వలలో వేసుకొని రూ. ఐదు లక్షల వరకు వసూలు చేసిందని వివరించారు. ఇంకా డబ్బులు తీసుకురావాలని బెదిరింపులకు పాల్పడటంతో తన కుమారుడు తనదగ్గర డబ్బులు లేవని చెప్పాడని అన్నారు. ఆమెపై హత్యాచారానికి యత్నించినట్లు కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మేరీని నిలదీస్తే తన పెద్దకుమారుడు ధనుంజయపై లైంగిక వేధింపుల కేసు పెట్టిందని చెప్పారు. మేరీ, ఆమె భర్త ఇద్దరూ వ్యభిచార దందా నడుపుతున్నారని... అందుకే స్థిరంగా రెండు మూడు నెలల కంటే ఎక్కువ ఉండరని వివరించారు.
అందుకే హెచ్చార్సీకి వచ్చా