నిర్మానుష్య ప్రాంతాల్లో నిలిపిన లారీల నుంచి డీజిల్‌ను దొంగిలించి ఓ కేంద్రాన్నే ఏర్పాటు చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాంపల్లి దాయరలో ఉన్న ఆ డీజిల్ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. దానికి అనుమతులు లేవని నిర్ధరించారు.
దొంగిలించిన డీజిల్‌తో కేంద్రం.. పోలీసుల దాడి
లారీల నుంచి డీజిల్‌ను దొంగిలించి అక్రమంగా నిల్వచేస్తున్న నిర్వాహకులను కీసర పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 30వేల లీటర్ల ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా డీజిల్ కేంద్రం, రాంపల్లి దాయర
దాదాపు 30 వేల లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గాల మధ్య ఫైటింగ్