తెలంగాణ

telangana

ETV Bharat / crime

రైలెక్కబోయి కిందపడి జూనియర్‌ ఆర్టిస్టు మృతి - జూనియర్ ఆర్టిస్టు

కదులుతున్న రైలు ఎక్కుతూ పడిపోయి తీవ్రగాయాల పాలై యువతి మృతి చెందిన ఘటన షాద్‌నగర్‌ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. మృతురాలు ఏపీలోని కడప వాసిగా పోలీసులు గుర్తించారు. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ఉద్యోగిగా పనిచేస్తూ.. జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తోందని వెల్లడించారు.

junior-artist-dies
జూనియర్‌ ఆర్టిస్టు మృతి

By

Published : Jan 19, 2022, 9:27 AM IST

Updated : Jan 19, 2022, 1:55 PM IST

ఆంధ్రప్రదేశ్​ కడప జిల్లా కేంద్రంలోని సినిమా స్ట్రీట్‌కు చెందిన జ్యోతిరెడ్డి(28) హైదరాబాద్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగిగా, జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. పండుగ నిమిత్తం సొంత ఊరికి వెళ్లిన ఆమె సోమవారం రాత్రి రైల్లో తిరుగు ప్రయాణం కాగా, మంగళవారం తెల్లవారుజామున రైలు షాద్‌నగర్‌లో ఆగింది. అయితే కాచిగూడ స్టేషన్ అని భావించిన రైలు దిగిన యువతి.. కాదని తెలుసుకుని తిరిగి ఎక్కేందుకు ప్రయత్నించింది.

అప్పటికే రైలు కదులుతుండటంతో అదుపుతప్పి కిందపడి గాయపడింది. తీవ్ర గాయాల పాలైన యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఇది రైల్వే సిబ్బంది నిర్లక్ష్యమంటూ యువతి బంధువులు, జూనియర్‌ ఆర్టిస్టులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు.

ఇదీ చూడండి:Murder Video: తాతను అత్యంత పాశవికంగా చంపిన మనమడు.. వీడియో వైరల్​..

Last Updated : Jan 19, 2022, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details