Ganja gang arrest హైదరాబాద్ సరిహద్దులో మరోసారి భారీమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు రెండు వాహనాల్లో తరలిస్తున్న కోటి 30 లక్షల విలువైన 590 కిలోలు పట్టుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ముఠా పట్టుబడినట్లు వెల్లడించారు.
ఏజెన్సీ ప్రాంతంలో కేజీ మూడు వేలకు అక్కడ కొంటున్నారు. మాకు 590 కేజీల గంజాయి దొరికింది. నిందితుడు సాయి కుమార్‌ను అరెస్ట్ చేశాం. మరో వ్యక్తి నాగరాజు ఇంకా పరారీలో ఉన్నారు. ఇతనిపై గతంలోనూ పీడీయాక్ట్ ఉంది. అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తాం. నాగరాజు దొరికితే మిగిలిన వారి వివరాలు తెలుస్తాయి.-మహేశ్ భగవత్, రాచకొండ పొలీస్ కమిషనర్
ఈ తనిఖీల్లో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు కార్లు, 8 చరవాణులు, రూ.1900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ప్రధాన నిందితుడు మహారాష్ట్రకి చెందిన పరశురాంగా పేర్కొన్నారు. నిందితుడు గతంలోనూ విశాఖపట్నంలో గంజాయి తరలిస్తూ అరెస్టయ్యాడని సీపీ తెలిపారు. రాష్ట్రానికి చెందిన మధ్యవర్తి సాయికుమార్‌ని అరెస్టు చేసినట్లు తెలిపిన సీపీ మరో ముగ్గురు పరారీలో ఉన్నారని చెప్పారు. గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మహేశ్ భగవత్ హెచ్చరించారు.
ఇవీ చదవండి:Fire Accident in Jeedimetla జీడిమెట్లలో రియాక్టర్లు పేలి భారీ అగ్నిప్రమాదం
రాంగ్ రూట్లో వచ్చి స్కూల్ వ్యాన్ను ఢీకొట్టిన లారీ, నలుగురు విద్యార్థులు మృతి