Brother Attack on Sister with Knife: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామంలో ఓ భూవివాదంలో తోడబుట్టిన చెల్లి, ఆమె భర్తపై సోదరులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. సంధ్యకు 20 సంవత్సరాల క్రితం రావుల రమేష్ అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. సంధ్య తల్లిదండ్రులు ఒక ఎకరం భూమిని ఆమె పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించారు. అవసరాల నిమిత్తం సంధ్య తన భూమిని వేరే వాళ్లకు అమ్మేసింది.
తోడబుట్టిన సోదరిపై సోదరుడు కత్తులతో దాడి.. కారణం అదేనా? - వరంగల్ తాజా నేర వార్తలు
Brother Attack on Sister with Knife: తమకు తెలియకుండా భూమి అమ్మిందనే కారణంతో తోడబుట్టిన సోదరులే.. సోదరి, ఆమె భర్తపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
సోదరి ఆమె భర్తపై కత్తులతో దాడి
ఈవిషయం తెలుసుకున్న సోదరులు బోల గాని శ్రీనివాస్, సురేందర్లు సంధ్యతో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా కత్తులతో విచక్షణారహితంగా ఇద్దరిపై చేశారు. ఈ ఘటనలో ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: లేలేత ప్రాయంలో మత్తుకు బానిసై.. వైట్నర్ సేవిస్తున్న చిన్నారులు