తెలంగాణ

telangana

ETV Bharat / crime

Illegal activities TTD Quarters : తితిదే క్వార్టర్స్​లో అసాంఘిక కార్యకలాపాలు..! - Illegal activities TTD Quarters at chittoor

Illegal activities TTD Quarters: ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలోని.. తితిదే అనుసంధానమైన శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ క్వార్టర్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు కొనగుతున్నాయి. నలుగురు వాద్య సిబ్బంది.. తితిదే గదుల్లో జల్సాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Illegal activities TTD Quarters
Illegal activities TTD Quarters

By

Published : Mar 30, 2022, 12:21 PM IST

Illegal activities TTD Quarters : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని.. తితిదే అనుసంధానమైన శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ క్వార్టర్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి మెట్టుకు వెళ్లే మార్గంలో ఉన్న తితిదే గదుల్లో.. నలుగురు వాద్య సిబ్బంది మందు, విందులతో జల్సాలు చేస్తున్నారని తెలుస్తోంది. వీరిని మూడేళ్ల క్రితం దినసరి కూలీల కింద తితిదే నియమించింది.

ఈ నలుగురు నిత్యం మిత్రులతో కలిసి మాంసం తింటూ మద్యం సేవిస్తున్నారనే విమర్శలున్నాయి. దేవస్థానం సన్నిధిలో కొనసాగుతున్న ఈ కార్యకలాపాలపై స్థానికులు మండిపడుతున్నారు. ఆలయ అధికారులకు తెలిసినా కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

Illegal activities TTD Quarters

ABOUT THE AUTHOR

...view details