జగిత్యాల జిల్లాలో ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ మమత భర్త రాజారెడ్డి(MPTC Mamatha Husband Rajareddy)... దారుణ హత్య(Brutal Murder)కు గురయ్యారు. ఓ పెళ్లి విందు సందర్భంగా ఎంపీటీసీ మరిది చిన్నరాజారెడ్డి... రమేశ్ అనే వ్యక్తి మధ్య ఘర్షణ తలెత్తింది. అక్కడే ఉన్నవారు... వారిద్దరిని సముదాయించారు.
Murder: ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ మమత భర్త రాజారెడ్డి హత్య - తెలంగాణ వార్తలు
ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ మమత భర్త రాజారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. జగిత్యాలలో జరిగిన పెళ్లి విందులో చెలరేగిన గొడవలో ప్రత్యర్థులతో దాడికి దిగారు. ఈ దాడిలో రాజారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Murder: ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ మమత భర్త రాజారెడ్డి హత్య
గొడవ విషయాన్ని చిన్నరాజారెడ్డి తన అన్నకు తెలిపాడు. రమేశ్ దగ్గరకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు మరోసారి గొడవ పడ్డారు. ఈక్రమంలో పరస్పరం తీవ్రంగా కొట్టుకున్నారు. ఎంపీటీసీ భర్త రాజారెడ్డిపై రమేశ్ వర్గీయులు పారతో దాడి చేయడంతో... అతడి తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.