సిద్దిపేట, వరంగల్, గుంటూరులో 8 ఇళ్లలో చోరీకి పాల్పడ్డ ఇద్దరు దొంగలను హైదరాబాద్ దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోడుప్పల్‌కు చెందిన సద్దాం అలీ, అన్వర్ అలీ వెల్డర్లుగా పని చేస్తున్నారు. సద్దాం అలీపై రాష్ట్ర వ్యాప్తంగా 53 చోరీ కేసులున్నాయి.
ఇద్దరు దొంగల అరెస్ట్.. 32లక్షల బంగారం, వెండి స్వాధీనం - cp anjani kumar latest news
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 32 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు.
సద్దాం అలీపై పోలీసులు పీడీ చట్టం కింద కేసు నమోదు చేయటంతో ఏడాది జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత మళ్లీ అన్వర్ అలీతో కలిసి చోరీలబాట పట్టాడు. పలు నగరాల్లో దొంగతనం చేశారు. నిందితుల నుంచి 32 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాలకు పాల్పడే వాళ్లపై పీడీ చట్టం నమోదు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:అలరిస్తున్న 'జాతిరత్నాలు' డిలిటెడ్ సీన్