Husband Killed Wife in Tirupati : భార్యభర్తలు కలిసుండటానికి కారణాలు చెప్పలేం కానీ.. విడిపోవాలనుకుంటే మాత్రం ప్రతీది ఓ కారణమే అవుతుంది. తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం వడ్డిపాలెంలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత.. భార్యభర్తలుగా కలిసి ఉండలేక 15 ఏళ్ల క్రితం ధనమ్మ, రమణయ్య దంపతులు విడాకులు తీసుకున్నారు.
15 ఏళ్ల క్రితం విడిపోయి.. రెణ్నెళ్ల క్రితం కలిసి.. అంతలోనే భార్యను చంపేశాడు - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు
Husband Killed Wife : ఆ భార్యభర్తలిద్దరు 15ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వాళ్లది అన్నట్లు ఉంటున్నారు. ఏమైందో తెలియదు కానీ రెండు నెలల క్రితం కలిశారు. అంతలోనే ఏమైందో.. ఇవాళ ఉదయం భార్యను తలపై ఇనుపరాడ్‌తో కొట్టి చంపాడు ఆ భర్త. ఈ దారుణ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో జరిగింది.
Husband Killed Wife in Tirupati
అనుకోకుండా రెండు నెలల క్రితం కలసిన వారు మళ్లీ దంపతులుగా మారిపోయారు. తరువాత ఏమైందో ఏమో గాని, ఇవాళ తెల్లవారు జామున ఇనుప రాడ్‌తో భార్య తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం ఊరి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..రమణయ్య కోసం గాలింపు చేపట్టారు.