Husband Attack On wife: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కట్టుకున్న భార్యనే కడతేర్చేందుకు యత్నించాడు ఓ కిరాతక భర్త. ఆమెపై అత్యంత పాశవికంగా కత్తితో దాడి చేశాడు. దీంతో వెంటనే తేరుకున్న స్థానికులు బాధితురాలిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి భర్తను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్‌లో చోటుచేసుకుంది.
Husband Attack On wife: బంజారాహిల్స్‌లో దారుణం.. భార్యను కత్తితో పొడిచిన భర్త - బంజారాహిల్స్ దారుణం
Husband Attack On wife: వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని భార్యనే అంతమొందించేందుకు యత్నించాడు ఓ దుర్మార్గుడు. భార్యపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో జరిగింది.
attack on wife with knife: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తాల్ల సంకీస ప్రాంతానికి చెందిన దొడ్ల శివ భార్య రజితతో కలిసి నగరానికి వచ్చి ఇందిరానగర్‌లో నివాసముంటున్నాడు. రజిత ఇళ్లల్లో పని చేస్తుండగా.. ఆమె భర్త శివ ఇతర కూలీ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శివ కొంతకాలంగా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో 6 నెలలుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
పీకల దాకా మద్యం సేవించిన శివ ఇందిరానగర్‌లోని ఇళ్లల్లో పనిచేస్తున్న భార్య రజిత బయటకు పిలిచి ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. ఆమె చేతి నరాన్ని కోయడంతోపాటు ఛాతీపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రజితను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.