తెలంగాణ

telangana

ETV Bharat / crime

బస్టాండ్​లో మహిళ హల్​చల్... చితకబాదిన స్థానికులు - కామారెడ్డి బస్టాండ్ వద్ద మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

Woman Hulchal in Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఓ మహిళ హల్​చల్​ చేసింది. చిన్నపిల్లల్ని పట్టుకునేందుకు యత్నిస్తోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆమె భర్తకు స్థానికులు దేహశుద్ధి చేశారు. మతిస్థిమితం సరిగ్గాలేని మహిళ ఛత్తీస్‌గఢ్ వాసిగా పోలీసులు గుర్తించారు.

Women Hulchal in Kamareddy
Women Hulchal in Kamareddy

By

Published : Jun 25, 2022, 5:30 PM IST

Woman Hulchal in Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఓ మహిళ నానా హంగామా సృష్టించింది. బస్టాండ్ ఆవరణలో పదే పదే చిన్న పిల్లల్ని పట్టుకునేందుకు యత్నిస్తున్న ఓ మహిళను స్థానికులు చితకబాదారు. తొలుత మూడు గంటల పాటు ఆమెను స్టేషన్​లో ఉంచిన పోలీసులు తిరిగి పంపించేశారు. మద్యం మత్తులో ఉన్న ఆమె భర్తకు స్థానికులు దేహశుద్ధి చేశారు.

మళ్లీ బస్టాండ్​కు వచ్చిన ఆమె... ప్రయాణికులను ఇబ్బంది పెడుతోందని తోటి వారు ఆగ్రహంతో చితకబాదారు. అయితే, మహిళ మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్లు తెలుస్తోంది. అనుమానస్పద రీతిలో ప్రవర్తిస్తున్న వీరు ఛత్తీస్ గఢ్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

బస్టాండ్​లో మహిళ హల్​చల్... పోలీసులు రావడంతో.!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details