శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం రాగా... తనిఖీ చేశారు. నిందితుని టీషర్టు లోపలి భాగంలో పేస్టు రూపంలో బంగారాన్ని దాచి తెచ్చినట్లు అధికారులు గుర్తించారు.
శంషాబాద్లో భారీగా విదేశీ బంగారం స్వాధీనం - భారీగా విదేశీ బంగారం స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర సుమారు 386 గ్రాముల బంగారం దొరికినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
huge gold seized in shamshabad airport
ప్రయాణికుడి వద్ద రూ.19.1 లక్షల విలువైన 386 గ్రాములు బంగారం దొరికినట్లు అధికారులు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బంగారం ఎవరు తెప్పించారు...? ఎక్కడికి తరలిస్తున్నారు...? వంటి కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.