Theft in Gold Shop: ఏపీలో విజయవాడ బందరు రోడ్డులోని అటికా గోల్డ్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. దుకాణంలో చొరబడిన దుండగులు రూ.60 లక్షల నగదు, 40 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కంపెనీకి చేరుకుని ఆరా తీస్తున్నారు. అయితే.. చోరీ జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Attica gold shop: బంగారుషాపులో చోరీ ఎప్పుడు జరిగిందనే విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బంగారం ఏవిధంగా కొనుగోలు చేస్తారు..? వినియోగదారులకు డబ్బులు ఎలా చెల్లిస్తారు? అనే విషయాలపై వివరాలు సేకరిస్తున్నారు. అయితే.. కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు నిన్నటి నుంచి సెలవులో ఉండటంతో వారి ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.