honey trapping gang arrested:ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. అంగీకరించగానే... కవ్వించే చాటింగ్, తీయటి మాటలతో మాటమాట కలిపి పరిచయాన్ని పెంచుకుంటారు. ఒంపుసొంపులు చూపించి కవ్విస్తారు. నగ్నంగా మాట్లాడుకుందామంటూ వీడియో కాల్ చేస్తారు. వలపువల విసిరి... ఎదుటి వ్యక్తిని ఉద్రేకపరుస్తారు. ఒంటిపై ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా తీసేస్తారు. అవతలి వ్యక్తి ప్యాంటు, చొక్కా విప్పించేలా ప్రేరేపిస్తారు. యువతి మైకంలో పడిపోయి ఇవతలి వ్యక్తీ దుస్తులు విప్పేస్తాడు. ఒంటిపై నూలుపోగు లేకుండా ఉన్న తర్వాత మాటల్లోకి దింపుతారు. కాల్ కట్ అయిన తర్వాత ఇవతలి వ్యక్తి వాట్సాప్‌కు వీడియోలు వస్తాయి. తెరిచి చూడగానే తన నగ్నదృశ్యాలు కనిపిస్తాయి....ఇక ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది.
పరువు పోతుందని ఎంత అడిగితే అంత..
ముంబయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో యువకులు... వలపు వలకు చిక్కి కోట్లు పోగొట్టుకున్నారు. చిక్కడపల్లిలో ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి 9లక్షలు బదిలీ చేశాడు. జూబ్లీహిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి 12లక్షలు సమర్పించుకున్నాడు. అశోక్‌నగర్‌లో ఓ వైద్యుడు ఏకంగా 15 లక్షలు పోగొట్టుకున్నాడు. అందరికీ తెలిస్తే పరువు పోతుందని సైబర్ నేరగాళ్లు ఎంత అడిగితే అంత చెల్లిస్తున్నారు.