తెలంగాణ

telangana

By

Published : Mar 28, 2022, 9:47 AM IST

ETV Bharat / crime

Ganja seized: గంజాయి తరలిస్తూ పట్టుబడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

Ganja seized: అతడో ప్రభుత్వ ఉపాధ్యాయుడు . పిల్లలను సరైన మార్గంలో నడిపించాల్సిన వ్యక్తే అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. డబ్బు కోసం కక్కుర్తి పడి గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

Accused
నిందితులు

Ganja seized: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొస్తూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల్లో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా రాంనగర్‌ ఠాణా పోలీసులు శనివారం చిచ్పల్లి సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. మంథని పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాచిడి శ్రీనివాస్‌గౌడ్‌, గంట శంకర్‌ రెండు వేర్వేరు కార్లలో గంజాయి తరలిస్తూ ఈ తనిఖీల్లో పట్టుబడ్డారు. రెండు వాహనాల్లో రూ.32 లక్షల విలువైన 103.83 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయి, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు.

శ్రీనివాస్‌గౌడ్‌ మంథనిలోని బెస్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతని మామ తెరాస మండలస్థాయి నేత. ఆంగ్ల బోధన శిక్షణ తరగతులకు శ్రీనివాస్‌గౌడ్‌ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్య కారణాలతో సెలవు తీసుకున్నాడని ఎంఈవో లక్ష్మి తెలిపారు.

ఇదీ చదవండి: భాకరాపేట ఘటనలో తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details