తెలంగాణ

telangana

ETV Bharat / crime

విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత.. కవర్‌లో తీసుకెళ్తుండగా.. - shamshabad international airport

శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టుబడింది. రూ.64.38 లక్షల విలువైన 1,237 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వస్తున్న మహిళను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

gold-seized-in-shamshabad-international-airport
gold-seized-in-shamshabad-international-airport

By

Published : Jul 6, 2022, 8:58 PM IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుడాన్‌కు చెందిన మహిళ నుంచి అక్రమంగా తరలిస్తోన్న కిలోకుపైగా విదేశీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుడాన్‌కు చెందిన మహిళ దుబాయ్‌ నుంచి బుధవారం హైదరాబాద్‌ వచ్చారు. ముందస్తు సమాచారం మేరకు కస్టమ్స్‌ అధికారులు మహిళను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు.

నల్లటి ప్లాస్టిక్‌ కవర్‌లో బంగారాన్ని దాచుకుని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. గాజులు, బిస్కెట్ల రూపంలో ఉన్న దాదాపు 1.237 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ.64.38 లక్షలు ఉంటుందని వెల్లడించారు. మహిళను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు.. బంగారాన్ని హైదారాబాద్‌లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకొచ్చారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నిందితురాలు గతంలో ఎప్పుడూ బంగారం తరలిస్తూ పట్టుబడలేదని ప్రాథమిక దర్యాప్తులో కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details