ఆదిలాబాద్ పట్టణ శివారులోని హేమంత్ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పత్తి గింజలను భారీగా నిల్వ ఉంచగా.. తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఎగిసి పడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
'జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం' - తెలంగాణ వార్తలు
ఆదిలాబాద్ పట్టణ శివారులోని ఓ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో మంటలను ఆర్పివేశారు.
'జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం'
అగ్నిమాపక సిబ్బందికి చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జరిగిన నష్టం ఇప్పుడే అంచనా వేయలేమని అగ్నిమాపక అధికారి అనిల్ తెలిపారు.
ఇదీ చదవండి:చొక్కాతో నిందితుడిని గుర్తించిన పోలీసులు