Ganja seize: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట పడటం లేదు. మీర్పేట్ పీఎస్ పరిధిలో 190 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కర్ణాటకకు గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో మీర్పేట పోలీసులు జిల్లెల గూడ చౌరస్తా వద్ద తనిఖీలు నిర్వహించారని డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
అందులో భాగంగా హైదరాబాద్కు వస్తున్న కారును తనిఖీ చేసిన పోలీసులు.. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. పాత నేరస్తుడు నేనావత్ కృష్ణ, సినీ పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న బోడా హథీరామ్లు మరో ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. సులభంగా డబ్బు సంపాదించాలని గంజాయి సరఫరాను చేస్తున్నారని తెలిపారు.