Cryptocurrency: క్రిప్టో కరెన్సీ పేరిట మోసం... రూ.86 లక్షలు టోకరా - cyber crime nws
10:28 November 06
క్రిప్టో కరెన్సీ పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న పశ్చిమ బంగాకు చెందిన ముగ్గురు నిందుతులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నగంలో పలు కేసులు నమోదు కావడంతో పశ్చిమ బంగా వెళ్లిన పోలీసు ప్రత్యేక బృందం ఇక్రాం హుస్సేన్, నూర్ ఆలం, ఇజారుల్‌ని అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చింది. వారి నుంచి 6 సిమ్‌కార్డులు, 5 చరవాణులు, 3 బ్యాంకు చెక్కు బుక్కులు, 6 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లోని రూ.50 లక్షల నగదు నిలుపుదల చేశారు.
పశ్చిమ బంగా సిలుగురికి చెందిన ప్రధాన నిందితుడు చోటా భాయ్ స్థానికంగా ఓ బ్యాంకులో పని చేసే నూర్ ఆలంతో కలిసి 14 షెల్ కంపనీలు ఏర్పాటు చేశాడు. వీటి ద్వారా ఆన్‌లైన్‌లో పెట్టుబడులు సేకరించాడు. ఇక్రాం హుస్సేన్, ఇజారుల్‌లు స్థానికంగా గ్రామస్థులకు కమీషన్ ఆశచూపి 64 బ్యాంకు ఖాతాలు సమకూర్చారు. అధిక పెట్టుబడులు వస్తాయని.. నాంపల్లికి చెందిన బాధితుడి వద్ద రూ.86 లక్షలు కాజేశారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా నేరాలకు పాల్పడిందని పోలీసులు గుర్తించారు. పశ్చిమ బంగాలో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు చోటా భాయ్ కోసం గాలిస్తున్నారు.