Thefts in gadwal : గద్వాలను గజదొంగలు గజగజలాడిస్తున్నారు. జిల్లాలో దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. పలు చోట్ల భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. గత కొన్ని నెలల్లో ఇళ్లు, కార్యాలయాలు, గుళ్లలోనూ పలు దొంగతనాలు జరిగాయి. ఈ చోరీలకు పోలీసుల వైఫల్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో సిబ్బంది గస్తీ కాస్తున్నారని చెబుతున్నారు.
Robbery in Gadwal : ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు గద్వాల పట్టణంలో 8 బృందాలు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం 2 బృందాలు మాత్రమే గస్తీ తిరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో జరిగిన దొంగతనాల్లో సొత్తు రికవరీ చేయడంలోనూ పోలీసు అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ప్రతి గల్లీలో యువకులను ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించేవారు. కానీ జిల్లా ఏర్పాటు తర్వాత దీన్ని పట్టించుకోవడం లేదు. అయితే దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో తమవంతు కృషి చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
గతేడాది ఇలా..
Chain Snatching in Gadwal : 2021లో జిల్లావ్యాప్తంగా ప్రాపర్టీ సంబంధిత కేసులు 136 కాగా ప్రాపర్టీ నష్టం రూ.1,58,89,060 జరిగిందని, అందులో రూ.95,12,200 రికవరీ చేసినట్లు ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ తెలిపారు. ఇందులో 60 శాతం మాత్రమే రికవరీ చేసినట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలకు ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. నెలలో రెండు, మూడు దొంగతనాలు జరుగుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జరిగిన దొంగతనాలు