తెలంగాణ

telangana

ETV Bharat / crime

డీఆర్​డీవో ఉద్యోగాల పేరిట మోసం... రూ.కోటితో పరారీ - ఉద్యోగాల పేరిట మోసం

డీఆర్​డీవో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ... ఒక్కొక్కరి వద్ద లక్ష నుంచి ఐదు లక్షలు కాజేశాడో ప్రబుద్ధుడు. సుమారు కోటీ రూపాయలతో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటన వనస్థలిపురంలో చేసుకుంది.

Fraud in the name of DRDO jobs
డీఆర్​డీవో ఉద్యోగాల పేరిట మోసం... రూ.కోటితో పరారీ

By

Published : Apr 13, 2021, 2:13 PM IST

హైదరాబాద్​లోని వనస్థలిపురంలోని శారదనగర్​లో రాయబాగి సాయినాథ్ స్థానికంగా నివాసముంటున్నాడు. అతను డిఫెన్స్​లో పని చేస్తున్నట్లు... తన స్నేహితులు తన కంటే మంచి స్థానంలో ఉన్నారంటూ చెప్పేవాడు. స్థానికంగా ఉండే నిరుద్యోగుల నుంచి పైసలు తీసుకుని డీఆర్​డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికేవాడు. ఇలా సుమారు 30 మంది నుంచి కోటీ రూపాయల వరకు వసూలు చేశాడు.

ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి 5లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవటంతో బాధితులు మోసపోయామని... పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయినాథ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. డీఆర్​డీవో పేరుతో ఉన్న నకిలీ ఐడీ కార్డ్స్, నకలీ ఓచర్స్, నకిలీ ప్యాడ్స్, రబ్బర్ స్టాంప్​లను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:మాదాపూర్​లో వ్యభిచార ముఠా అరెస్ట్​.. పరారీలో ప్రధాన నిందితుడు

ABOUT THE AUTHOR

...view details