ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు - Mupkal car accident news
07:52 August 10
నిజామాబాద్ ముప్కాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Nizamabad car accident : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదం... ఓ కుటుంబంలో విషాదం నింపింది. అతివేగం ఇద్దరు చిన్నారులతో సహా నలుగురి ప్రాణాలు తీసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
హైదరాబాద్ టోలీచౌకికి చెందిన జుబేర్ ఇబ్రహీం... భార్య పిల్లలు, బావమరిదితో కలిసి మహారాష్ట్రలోని బంధువుల ఇంటికి కారులో వెళ్తున్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్దకు చేరుకోగానే... డ్రైవర్ నిద్రమత్తులో కారును డివైడర్‌కు ఢీకొట్టాడు. వెంటనే కారు రెండు పల్టీలు కొట్టి... వంద మీటర్లకు దూరం వెళ్లి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జుబేర్ ఇబ్రహీం, అతని భార్య బేగం, ఇద్దరు చిన్నారులు అహ్మద్, మరో ఆరు నెలల పసికందు అక్కడిక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలుకాగా... నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు