మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలో పాముకాటుతో నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. పట్టణానికి చెందిన రాములు, రేణుక దంపతులు కూతురు సావిత్రితో కలిసి ఆరుబయట పడుకున్నారు. ఉదయం చిన్నారి ఏడవడం వల్ల లేచిన తల్లిదండ్రులు.. పామును గుర్తించి చంపారు.
పాముకాటుతో నాలుగు నెలల చిన్నారి మృతి - పాముకాటుతో చిన్నారి మృతి
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. నాలుగు నెలల చిన్నారి పాముకాటుకు గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
పాముకాటు, మెదక్ జిల్లా నర్సాపూర్
తక్షణమే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పాపను తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. పాప చికిత్స పొందుతూ మృతి చెందింది. శవపరీక్ష అనంతరం తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. వారు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.