Road accidents in Telangana Today: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్పత్రి పాలయ్యారు.
డివైడర్‌ను ఢీకొట్టి
Medchal Road Accident Today :: మేడ్చల్ చెక్ పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కొంతమంది యువకులు మారుతీ ఎకో వాహనంపై హైదరాబాద్ వస్తుండగా... బావర్చి కూడలిలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో కారులో మొత్తం తొమ్మిది మంది ఉన్నట్లు వెల్లడించారు. మద్యం మత్తే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జాతరకు వెళ్తూ.. అదుపు తప్పి
Suryapet Accident News Today : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి శివారులో... అతివేగం ఇద్దరు ప్రాణాలను బలిగొంది. తమ్మరబండ పాలెంకు చెందిన ముగ్గురు యువకులు అరవింద్(22), హంజద్(20), అనిల్... శివరాత్రి సందర్భంగా ద్విచక్ర వాహనంపై మేళ్లచెరువు జాతరకు వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో కిందపడి.... మరో వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టారు. ప్రమాదంలో హంజద్ అక్కడికక్కడే మృతిచెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరవింద్ ప్రాణాలు కోల్పోయారు. అనిల్, మరో వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో... వారికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.