Foreign Current Seized : హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు శుక్రవారం రోజున తనిఖీలు చేపట్టారు. దుబాయ్ వెళ్తున్న ఇద్దరి ప్రయాణికుల నుంచి రూ.38.58 లక్షల రూపాయలు విలువ చేసే విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
Foreign Current Seized : శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత - Shamshabad airport crime news
Foreign Current Seized : విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఎంత కట్టుదిట్టంగా తనిఖీలు చేపడుతున్నా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్‌కు విదేశీ కరెన్సీ తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.38.58 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు.
FOREIGN CURRENCY
కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన కరెన్సీలో అమెరికన్ డాలర్స్‌తో పాటు యూఏయీ ధీరమ్స్ ఉన్నాయి. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Janga Reddy Passed Away :భాజపా సీనియర్ నేత, మాజీ ఎంపీ కన్నుమూత
Last Updated : Feb 5, 2022, 10:58 AM IST