Fisherman died in a fish attack: ఏపీలోని విశాఖ జిల్లా పరవాడ మండలం జాలారిపేట గ్రామానికి చెందిన నొల్లి జోగన్న.. కమ్ముకోనాం చేప దాడిలో మృతి చెందాడు. ఆరుగురు మత్స్యకారులతో కలిసి ముత్యాలమ్మపాలెం తీరం నుంచి ఆదివారం ఫైబర్ బోటుపై చేపలవేట వెళ్లారు. ఒడ్డు నుంచి సుమారు 90కిలోమీటర్లు దూరం వెళ్లాక సుమారు 300 గేలాలను వేసి వేట సాగించారు. ఈ క్రమంలో ఒక గేలానికి సుమారు 80 నుంచి 100 కేజీల బరువున్న కొమ్ముకోనాం చేప చిక్కింది. దాన్ని అధీనంలోకి తీసుకోవడానికి గేలంతో కూడిన తాడుని ఎంతలాగినా పైకి రాలేదు. బోటుకు సుమారు 3 మీటర్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది.
Fisherman died in a fish attack: చేప దాడిలో మత్స్యకారుడు మృతి.. ఏం జరిగిందంటే?
Fisherman died in a fish attack: మత్యకారుడు వేసే వలకు ఎన్నో చేపలు చిక్కి.. ప్రాణాలు కోల్పోతుంటాయి. కానీ.. ఈసారి అలా జరగలేదు. చేప చేసిన దాడిలో ఓ మత్యకారుడే ప్రాణాలు వదిలాడు. అసలు ఏం జరిగిందో మీరే చూడండి..
Fisherman Died
ఈ పరిస్థితుల్లో నొల్లి జోగన్న కర్ర ఉన్న గేలాన్ని కొమ్ముకోనాం చేపకు వేస్తుండగా.. అదుపుతప్పి నీళ్లలో పడిపోయాడు. వెంటనే కొమ్ముకోనాం చేప ముక్కుపైనున్న కొమ్ముతో... జోగన్న పొట్టపై దాడి చేసింది. ఈ ఘటనలో అక్కడికక్కడే జోగన్న చనిపోయాడు. ఆ తర్వాత చేప తప్పించుకుని వెళ్లిపోయింది. జోగన్న మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చిన తర్వాత పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
- సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి