Hyderabad Fire Accident : హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు సమీపంలోని రహదారి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికంగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కంగారుపడ్డారు.
ఎయిర్ పోర్టు సమీపంలో ఒక్కసారిగా మంటలు.. అలుముకున్న దట్టమైన పొగలు - తెలంగాణ టాప్ న్యూస్
Hyderabad Fire Accident : బేగంపేట ఎయిర్పోర్టు సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికంగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఏం జరుగుతుందో తెలియక స్థానికులు కాసేపు భయాందోళనలకు గురయ్యారు.
ఎయిర్ పోర్టు సమీపంలో ఒక్కసారిగా మంటలు
వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పివేశారు. ఖాళీ ప్రదేశంలో వైర్లు రసాయనిక పదార్థాలు ఉండటంతో మంటలు మరింతగా వ్యాపించాయి. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి:యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్న సీఎం