తెలంగాణ

telangana

ETV Bharat / crime

పాతబస్తీలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం - హైదరాబాద్​లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్​ పాతబస్తీలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. షార్ట్​సర్క్యూట్​ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు.

fire accident in dabeerpura hyderabad
పాతబస్తీలోని అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం

By

Published : Mar 24, 2021, 4:10 AM IST

హైదరాబాద్ డబీర్​పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫారత్ నగర్​లో గల ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

పాతబస్తీలోని అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. పలు విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నాడు.

ఇదీ చదవండి:కృష్ణా నదిలో యువకుడి గల్లంతు

ABOUT THE AUTHOR

...view details