తెలంగాణ

telangana

ETV Bharat / crime

fire accident: బంజారాహిల్స్​లోని ఓ అపార్ట్​మెంట్​లో అగ్నిప్రమాదం - బంజారాహిల్స్​లో అగ్నిప్రమాదం

బంజారాహిల్స్‌ (banjara hills) రోడ్‌ నెంబర్ 86లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

fire accident
fire accident

By

Published : Aug 5, 2021, 3:26 PM IST

Updated : Aug 5, 2021, 4:26 PM IST

హైదరాబాద్​ బంజారాహిల్స్​ రోడ్​నెంబర్​ 86లోని ఓ అపార్ట్​మెంట్​లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్​మెంటులోని కింది గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి (fire accident). ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. ఇంట్లోని వంట సామాగ్రి, ఫర్నీచర్ ఇతర గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుదాఘాతంతోనే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు గుర్తించారు.

బంజారాహిల్స్​లోని ఓ అపార్ట్​మెంట్​లో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి:LIVE VIDEO: గొడ్డలి, బండరాళ్లతో దాడి.. పాత కక్షలే కారణం

Last Updated : Aug 5, 2021, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details