ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని శ్రియ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో వైద్యుడి గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫర్నిచర్ దగ్ధమైంది. వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది... విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
FIRE ACCIDENT: ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణం - crime news in west godavari district
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చేలరేగి, ఫర్నిచర్ దగ్ధమైంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
అగ్నిప్రమాదం
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రమాద సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంటలు ఇతర గదులకు వ్యాపించకపోవడంతో... ప్రాణనష్టం తప్పింది.
ఇదీ చదవండి:Pregnant Died: సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి మృతి