తెలంగాణ

telangana

ETV Bharat / crime

మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం - medi cover hospitals in hyderabad

Medicover hospital fire accident: సికింద్రాబాద్​లోని బేగంపేట మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో మంటలు చెలరేగడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Medicover hospital fire accident
Medicover hospital fire accident

By

Published : Sep 2, 2022, 5:21 PM IST

Updated : Sep 2, 2022, 6:45 PM IST

Medicover hospital fire accident: బేగంపేటలోని మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు. ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో వెల్డింగ్ చేస్తుండగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.

మంటలను గమనించిన ఆస్పత్రి సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆరో అంతస్తులో చెత్త ఉండటం వల్లే ఒకసారిగా మంటలు అంటుకున్నాయని ప్రాథమికంగా నిర్థారించారు.

మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
Last Updated : Sep 2, 2022, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details