వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సహకార కేంద్ర బ్యాంకులో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొన్ని దస్త్రాలు దగ్ధమవడంతో అధికారులు ఆందోళన చెందారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
డీసీసీబీ బ్యాంకులో అగ్నిప్రమాదం.. దస్త్రాలు దగ్ధం - hanamkonda dccb bank
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ చౌరస్తాలోని డీసీసీబీ బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో దస్త్రాలు దగ్ధమయ్యాయి.
డీసీసీబీ బ్యాంకులో అగ్నిప్రమాదం.. దస్త్రాలు దగ్ధం
బ్యాంకులో మంటలు చెలరేగడంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. ఫలితంగా కొంత ప్రమాదం తప్పింది. ఆస్తినష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
- ఇవీచూడండి:కరోనా వైరస్ మళ్లీ జూలు విదిలిస్తోందా..?